ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. ఈ వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ మ్యారేజ్ కి అటెండ్ అయ్యారు.పెళ్ళికి వచ్చిన గెస్ట్స్ అందరూ టాలీవుడ్ సీనియర్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ తో ఫొటోస్ దిగాలని అడిగినపుడు ,ఈ స్టార్ హీరోస్ వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ పెళ్లిలో ఈ స్టార్ హీరోస్ దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.నిర్మాత బండ్ల గణేష్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రోజా కూడా ఈ మ్యారేజ్ కి అటెండ్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa