బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే "గెహ్రైయాన్" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిన సంగతే.శకున్ బత్రా దర్శకత్వం వహించిన "గెహ్రైయాన్"లో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ,ధైర్య కర్వా కూడా కనిపించనున్నారు .అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా డైరెక్ట్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ఫిబ్రవరి 11న అందుబాటులోకి వచ్చింది. రొమాంటిక్ డ్రామా ట్రాక్ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా కి అమెజాన్ ప్రైమ్ "గెహ్రైయాన్" సినిమా కు పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది అని సమాచారం. "గెహ్రైయాన్" డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ రైట్స్ కోసం అమెజాన్ 100 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది అని లేటెస్ట్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa