ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్విపాత్రాభినయంలో ధనుశ్...కొత్త ప్రయోగానికి సద్దం

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 01:49 PM

ద్విపాత్రాభినయం నటించి హీరో ధనుశ్ కొత్త ప్రయోగానికి సన్నద్దమవుతున్నాడు. కోలీవుడ్ లో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే కథానాయకులలో కమల్ ముందుగా కనిపిస్తారు. ఆ తరువాత స్థానంలో విక్రమ్ .. సూర్య నిలుస్తారు. ఇక వాళ్లిద్దరి బాటలోనే నడిచే హీరోగా ధనుశ్ కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ధనుశ్ కథాపరంగా .. పాత్రల పరంగా ప్రయోగంతో కూడిన సాహసాలే చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రమైన 'నానే వరువేన్' కూడా వైవిధ్యభరితమైన సినిమానే. ఈ సినిమాలో ధనుశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలకి సంబంధించిన లుక్స్ ను ఒకే పోస్టర్ ద్వారా నిన్న రిలీజ్ చేశారు. ఒక పాత్ర డీసెంట్ గా ఉంటే, మరో పాత్ర అందుకు పూర్తి భిన్నంగా .. మానసిక స్థితి సరిగ్గాలేని ఒక మాస్ పాత్ర అనిపిస్తోంది. ఈ పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందుజ రవిచందర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమాను, ఈ ఏడాది చివరిలో విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa