ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలో గుడ్ ల‌క్ స‌ఖి..

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 01:50 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్టే మూవీ గుడ్ లక్ సఖి. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి .. జగపతి బాబు కూడా కీలకపాత్ర సోశించారు. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్‏గా ఎలా మారిందనే కథాంశంతో.. స్పోర్ట్స్ బ్యాక్‏డ్రాప్‏లో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 28న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ సినిమాది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధమైంది. గుడ్ లక్ సఖి సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో ఫిబ్రవరి 12న స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు మేకర్స్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa