ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న బ్రిటీష్ తార ఒలీవియా మోరిస్. అక్కడ టెలివిజన్ సిరీస్ లు చేసిన పేరు తెచ్చుకున్న ఒలీవియా…ఆర్ఆర్ఆర్ లో ఒక నాయికగా నటించింది. ఎన్టీఆర్ కు ఈ భామ జోడీగా కనిపించనుంది. నాటు నాటు పాట లిరికల్ సాంగ్ లో ఒలీవియాను చూపించారు.ఎన్టీఆర్ చరణ్ మాస్ స్టెప్పులు చూసి ఒలీవియా ఎంజాయ్ చేయడం ఆ పాట వీడియోలో ఉంది. ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా ఆమె మరో తెలుగు ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిందని సమాచారం. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ తమిళ హీరో శివకార్తికేయన్ తో ఓ సినిమాను మొదలుపెట్టారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది.
ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలు ఉంటారని, ఒక హీరోయిన్ గా ఒలీవియాను ఎంపిక చేశారట చిత్రబృందం. శివకార్తికేయన్ అనుదీప్ సినిమా చిత్రీకరణ కథానుసారం విదేశాల్లో ఉండనుంది. అక్కడే ఈ బ్రిటీష్ నటితో సినిమా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఆర్ఆర్ఆర్ నాయిక క్రేజ్ కూడా ఈ సినిమాకు కలిసిరానుంది.
గతంలో తెలుగు చిత్ర నిర్మాతకు తన పెట్టుబడిని తిరిగి రాబట్టుకునేందుకు థియేటర్ అనే ఒకే ఒక ప్రధాన మార్గం ఉండేది. ఆడియో హక్కులు ఉన్నా వాటి వల్ల దక్కింది చాలా తక్కువే. ఇప్పుడు అనేక విధాలుగా నిర్మాతకు ఆదాయం దక్కుతోంది. ఓటీటీ హక్కులు, ఓవర్సీస్ మార్కెట్, యూట్యూబ్, థియేట్రికల్ రిలీజ్ లు, శాటిలైట్ ప్రసార హక్కులు, ఇతర భాషల డబ్బింగ్ రైట్స్..ఇలా బడ్జెట్ రికవరీకి అవకాశం ఏర్పడింది. దీంతో క్రేజీ ప్రాజెక్టులకు దర్శకులు కోరింది ఇస్తున్నారు. ఈ వెసులుబాటు పరభాషా నటీనటుల నుంచి విదేశీ నాయికలు దాకా వెళ్లింది. ఇలా ఓలీవియా లాంటి తారలు తెలుగు తెరపై నటించగలుగుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa