సినిమాలో ముందు అనుకొన్న తారాలను ఆ తరువాత మార్చడం సహజంగానే జరుగుతుంటుంది. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. కెరియర్ పరంగా ఇది గోపీచంద్ కి 30వ సినిమా. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా రాజశేఖర్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన తప్పుకున్నట్టుగా ప్రచారం జరిగింది. అందులో వాస్తవమెంతన్నది తెలియదు. కానీ ఈ సినిమాలో జగపతిబాబు చేయనున్నాడనేది ఈ రోజున ఖాయమైంది. జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఈ సినిమా టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానం పలికింది. దాంతో ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా కనిపించనున్నాడనేది స్పష్టమైపోయింది. ఇక ఆల్రెడీ ఈ ఏడాదిలో 'గని' .. 'రాధే శ్యామ్' .. 'సలార్' సినిమాలతో జగపతిబాబు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇంతకుముందు శ్రీవాస్ తెరకెక్కించిన 'లక్ష్యం' .. 'సాక్ష్యం' సినిమాల్లోను జగపతిబాబు నటించారు. గోపీచంద్ కి రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాస్, ఈ సినిమాతో ఆయనతో కలిసి హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa