ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాశానిలా కనబడనీ .. వినబడనీ ప్రేమలేఖ లిరికల్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 12:49 PM

కరోనా శాంతిస్తున్న నేపథ్యంలో సినిమాల దూకుడు పెరిగింది. శ్రీవిష్ణు కథానాయకుడిగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో 'భళా తందనాన' సినిమా రూపొందింది. వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో, కథానాయికగా కేథరిన్ నటించింది. శ్రీకాంత్ విస్సా కథను అందించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'రాశానిలా కనబడనీ .. వినబడనీ ప్రేమలేఖ. చూశానీలా కదలననే వదలననే మౌనరేఖ' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి - రమ్య బెహ్రా ఆలపించారు. ఇంతకుముందు శ్రీ విష్ణు హీరోగా వచ్చిన 'రాజ రాజ చోర' బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ తరువాత వచ్చిన 'అర్జున ఫల్గుణ' ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. ఇక 'వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత కేథరిన్ చేసిన సినిమా ఇదే. అందువలన ఇద్దరికీ ఈ సినిమా హిట్ కొట్టడం అవసరమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa