ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఇతరుక్కుమ్ తునింధవన్' సిద్దం

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 12:50 PM

సూర్య నట్టించిన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఇతరుక్కుమ్ తునింధవన్' సిద్దమవుతోంది. కోలీవుడ్లో వైవిధ్యభరితమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కథానాయకుడిగా సూర్యకి మంచి పేరు ఉంది. తన సినిమాల మధ్య ఆయన ఎంతమాత్రం గ్యాప్ రానీయడు. ఒకవేళ గ్యాప్ వస్తుందనిపిస్తే తన సొంత బ్యానర్లో సినిమా చేసి ఆ టైమ్ వృథా కాకుండా చూసుకుంటాడు. కరోనా సమయంలో ఆయన చేసిన రెండు సినిమాలు ఓటీటీలో వచ్చాయి. ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించిన 'ఆకాశం నీ హద్దురా' .. 'జై భీమ్' సినిమాలు రెండూ కూడా అనూహ్యమైన ఆదరణ పొందాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఇతరుక్కుమ్ తునింధవన్' సిద్ధమవుతోంది. తెలుగులో ఈ సినిమాను 'ఈటీ' టైటిల్ తో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. మార్చి 10వ తేదీన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను విడుదల కానుంది. తెలుగులో సూర్య తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక మోహన్ ఆకట్టుకోనుంది. ఇమాన్ సంగీతాన్ని అందించగా, సత్యరాజ్ .. శరణ్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa