ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముచ్చింతల్ కు సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 12:51 PM

ముచ్చింతల్ కు ప్రముఖుల తాకిడి పెరిగిపోతోంది. ముచ్చింతల్ లోని సమతామూర్తి సన్నిధిని మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు. తన సతీమణి సురేఖతో కలిసి ముచ్చింతల్ కు వెళ్లారు. ఆశ్రమానికి విచ్చేసిన చిరంజీవి దంపతులకు చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు పలికారు. సమతామూర్తి ప్రతిమను చిరంజీవికి అందించారు. ఇప్పటికే చిరంజీవి సోదరుడు, జనసేనాని పవన్ కల్యాణ్ సమతామూర్తిని దర్శించుకున్నారు. మరోవైపు ఈరోజు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతామూర్తిని దర్శించుకోవడానికి హైదరాబాద్ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా 120 కేజీల శ్రీరామానుజ బంగారు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa