ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవడో త‌మ‌ ప్రాణాలను చాలా చాలా ఈజీగా ఆన్‌లైన్‌లో పెట్టేశాడు

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 12:53 PM

సర్కార్ వారీ పాటల లీక్ పై థమన్ స్పందించాడు. ఎవడో త‌మ‌ ప్రాణాలని తీసుకుని చాలా చాలా ఈజీగా ఆన్‌లైన్‌లో  పెట్టేశాడని థ‌మ‌న్ ఆవేద‌నాభ‌రిత వ్యాఖ్య‌లు చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు న‌టించిన‌ సర్కారువారి పాట సినిమాలోని క‌ళావ‌తి పాట ఆన్‌లైన్‌లో లీకైన విష‌యం తెలిసిందే. దీనిపై థ‌మ‌న్ వీడియో రూపంలో స్పందించారు. మ‌న‌సు చాలా బాధగా ఉందని, త‌న‌కు ఏం చెప్పాలో అర్థం కావట్లేదని అన్నారు. ఎంతో కష్టప‌డ్డామ‌ని, ఆర్నెల్లుగా ఈ వీడియో కోసం ఎంతో కష్టపడ్డామ‌ని, కొవిడ్ వేళ రాత్రి, పగలు అందరం కలిసి శ్రమించామ‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో ఎనిమిది తొమ్మిది మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని, అయినప్ప‌టికీ ఈ పాట‌ కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు. నిర్మాత పెట్టుబ‌డి, తాము త‌మ‌ హీరోకి చూపించాల్సిన ప్రేమ, అభిమానం మా పాటలో ఉంటుంద‌ని అన్నారు. ఈ పాట‌కు అద్భుతమైన లిరిక్స్ రాశార‌ని, డైరెక్టర్ ఎంతో సంతోష ప‌డ్డార‌ని చెప్పారు. ఎంతో ఉత్సాహంగా చేసిన లిరికల్ వీడియో ప్ర‌పంచంలోనే బెస్ట్ అనేలా చేశామ‌ని తెలిపారు. ఈ పాటకు ఎంతో టెక్నాలజీని వాడామ‌ని అన్నారు. ఎవడో త‌మ‌ ప్రాణాలని తీసుకుని చాలా చాలా ఈజీగా ఆన్‌లైన్‌లో  పెట్టేశాడని థ‌మ‌న్ ఆవేద‌నాభ‌రిత వ్యాఖ్య‌లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa