ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయి

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 03:15 PM

కంగనా రౌనత్ ఈ పేరు వింటూనే ఎవరైనా వివాదాలకు చిరునామాగా పేర్కొంటారు. ఆమె తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్ దీపిక పదుకొణే సినిమాపై కంగ‌నా ర‌నౌత్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. శకున్ బత్రా దర్శకత్వంలో దీపిక పదుకొణే నటించిన ‘గెహ్రాయాన్’ సినిమా ఈ నెల‌ 11న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది.  ఇందులో సిద్ధాంత్ చతుర్వేదితో దీపిక‌ రొమాంటిక్ సీన్ల మోతాదు శృతి మించింద‌ని వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌పై కంగ‌నా ర‌నౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. తాను కూడా నవ తరానికి చెందిన వ్యక్తినే కానీ, ఇటువంటి రొమాన్స్‌ని అర్థం చేసుకోగలనని చెప్పింది. దయచేసి కొత్త త‌రం యువ‌త, అర్బన్ సినిమాల పేరుతో ఇటువంటి చెత్తను అమ్మకానికి పెట్టకండంటూ ఆమె ఫైర్ అయ్యింది. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయ‌ని చెప్పుకొచ్చింది. స్కిన్ షో, అశ్లీలత వంటివి చెత్త సినిమాల‌ను ఏ మాత్రం కాపాడలేవని పేర్కొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa