రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్,పూజా హెగ్డే నటిస్తున "రాధే శ్యామ్" సినిమా విడుదలకి సిద్ధమైంది.కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ చాలా సార్లు వాయిదా వేశారు అని అందరికి తెలిసిన విషయమే.లాస్ట్ కి, ఈ హై బడ్జెట్ పీరియాడికల్ రొమాంటిక్ థ్రిల్లర్ మార్చి 11, 2022 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.వాలెంటైన్స్ డే స్పెషల్ గా " రాధే శ్యామ్" టీమ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేస్తుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.రేపటి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ టాప్ గేర్‌లో స్టార్ట్ అవుతుండగా ,మేకర్స్ పోస్టర్స్ అండ్ వీడియో గ్లింప్సె ని రెడీ చేస్తున్నారు."రాధే శ్యామ్"ను ప్రభాస్ దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయనున్నారు అని మేకర్స్ ప్రకటించారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa