సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి నటిస్తున "భీమ్లా నాయక్" విడుదల చెయ్యటానికి మూవీ మేకర్స్ సిద్దంగా ఉన్నారు.ఈ చిత్రంలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు."భీమ్లా నాయక్" టైటిల్ సాంగ్ వీడియోను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ నిన్న ప్రకటించారు.తాజాగా ,మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నిన్న సోషల్ మీడియా లో ఒక ఫోటో ని షేర్ చేస్తూ "భీమ్లా నాయక్ " నెక్స్ట్ సాంగ్ అప్డేట్ ని ఇచ్చారు.రిలీజ్ చేయబోయే సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాసారు అని ఈ సాంగ్ ని కైలాష్ ఖేర్ పాడారు అని థమన్ వెల్లడించారు."భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా మరియు థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa