అనసూయ భరద్వాజ్ పెద్ద స్క్రీన్‌లలో ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలం లో రిలీజ్ అయినా స్టార్ హీరో సినిమాలలో కూడా కనిపించింది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పొలిటికల్ డ్రామా ట్రాక్ లో వస్తున్న "గాడ్ ఫాదర్ " సినిమా లో అనసూయ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ,ఈ సినిమా లో న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా నటిస్తుందని సమాచారం. "గాడ్ ఫాదర్ " సినిమా లో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది . ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మోహన రాజా దర్శకత్వం వహించిన "గాడ్ ఫాదర్" సినిమా మలయాళంలో "లూసిఫర్" సినిమాకు రీమేక్.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa