ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కైలాశ్ ఖేర్ తో బీమ్లా నాయక్ లో మరో పాట

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 14, 2022, 03:17 PM

బీమ్లా నాయక్ పై రోజురోజుకు పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో సినిమా రూపకర్తలు ఈ చిత్ర నిర్మాణంపై ఎంతో శ్రద్ద తీసుకొంటున్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించాడు. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. తాజాగా మరో పాట పాడటానికి కైలాశ్ ఖేర్ ను తీసుకున్నారు. "మా సెన్సేషనల్ 'భీమ్లా నాయక్'లో మరో క్రేజీ ఎడిషన్ .. ఈ సినిమాలో ఒక పాటను పాడటానికిగాను కైలాశ్ ఖేర్ ను త్రివిక్రమ్ గారు తీసుకొచ్చారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రిగారు రాశారు" అని చెబుతూ, ఆ సందర్భంలో దిగిన ఒక ఫొటోను తమన్ పోస్ట్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఏదైనా సందర్భంలో ఒక పాట ఉంటే బాగుంటుందని భావించి కొత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారేమోనని అనిపిస్తోంది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఈగో వార్. మరో కథానాయకుడిగా డేనియల్ శేఖర్ పాత్రలో రానా నటించాడు. పవన్ సరసన నిత్యామీనన్ .. రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనున్నారు. ఈ సినిమాకి రెండు రిలీజ్ డేట్లు అనుకున్నారు. త్వరలోనే ఒక రిలీజ్ డేట్ ను ఖరారు చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa