ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కలు నాటిన సినీ నటుడు అమిత్ తివారి

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 14, 2022, 03:46 PM

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ ఎంసీ పార్కులో సినీ నటుడు అమిత్ తివారీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అమిత్ తివారీ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు. ఈ మహత్తర కార్యక్రమంలో భాగమైనందుకు, ఈ ప్రపంచంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అందరితో పంచుకున్న ఎంపీ సంతోష్ కుమార్ కు అమిత్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత తన స్నేహితులు కాలకేయ ప్రభాకర్, కిరీటి దామరాజు, రాఘవలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa