సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ నటించిన" గంగూబాయి కతియావాడి" ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎదురుచూసిన హిందీ సినిమాలలో ఒకటి అని చెప్పొచ్చు.ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ లో అలియా ఈ పాత్రకు సెట్ అవడం లేదు అని ,చాలా యంగ్‌గా కనిపిస్తోందని సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోల్ల్స్ పై అలియా రియాక్ట్ అయ్యింది.ప్రజలు అందరూ నేను ఓల్డ్ వుమన్ గా నటించడం లేదని ,గంగూబాయి గురించి మీకు పూర్తిగా తెలియదు . ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూసి ఆమె 50 ఏళ్ల వయస్సులో ఉన్న రోల్ ని నేను చేస్తున్నట్లు ఊహించుకుంటున్నారు అది నిజం కాదు అని అలియా ట్రోల్లెర్స్ కి ఆన్సర్ ఇచ్చింది.బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామాగా రూపొందించబడిన ఈ సినిమాలో హుమా ఖురేషి మరియు ఇమ్రాన్ హష్మీ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.అంకిత్ బల్హారా, సంచిత్ బల్హారా మరియు సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాకి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa