కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తునా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి ఇదే విషయాన్ని అనౌన్స్ చేసారు.ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.త్వరలో "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా టీమ్ సెన్సార్‌కి అప్లై చేయనున్నారు అని మూవీ మేకర్స్ వెల్లడి చేసారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa