కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ రూ.25 కోట్లకు సేల్ అయ్యింది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా ,రెండో సాంగ్ ని కూడా మూవీ మేకర్స్ రిలీజ్ నిన్న రిలీజ్ చేసారు."ఓహ్ మై ఆధ్య" అనే టైటిల్ తో రిలీజ్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ ని యాజిన్ నిజార్ పాడగా,దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసారు .ఈ మధ్య కాలం లో రిలీజ్ అయిన శర్వా సినిమాలు ఫ్లాప్ అవుతునే ఉన్నాయి.ఈ సినిమా అయినా శర్వా కెరీర్‌లో సక్సెస్‌గా నిలుస్తుందో లేదు చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa