ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్ర ఆడియన్స్ హిట్ చేస్తారో లేదో అని భయమేసింది అంటున్న "డీజే టిల్లు" హీరో

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 11:52 AM

విమల్ కృష్ణ  డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి జంటగా నటిస్తున "డీజే టిల్లు"   ప్రేక్షకుల ముందుకు వచ్చింది . రొమాంటిక్ యాక్షన్  ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ని  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఈ మూవీ లో రిలీజ్ అయినా సాంగ్స్ అండ్ టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ,ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయ్యింది అని సమాచారం.డీజే టిల్లు బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది అని చెప్పొచ్చు .ఈ మూవీ ఇప్పటికే బ్రేక్‌ఈవెన్‌కు చేరుకోగా ,  USAలో $200K కంటే ఎక్కువ వసూలు చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి.విజయవాడలోని ఓ థియేటర్‌లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. డీజే టిల్లు నైజాంలో హిట్ టాక్ వస్తుంది అని మా టీమ్ కి తెలుసు కానీ ఆంధ్ర లో కొంచం డౌట్ పడ్డాము.ఆంధ్ర సినిమా లవర్స్ అండ్ ఆడియన్స్ మాస్ సినిమా పై చూపించిన ఆదరణ నాకు చాల హ్యాపీ ఫీలింగ్ ఇచ్చింది అని అన్నారు .ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉన్న ఈ సినిమా చాలా ఏరియాల్లో "ఖిలాడీ" కలెక్షన్స్ ని క్రాస్ చేసింది అని లేటెస్ట్ బజ్ .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa