ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ రాబోయే ఆరు ప్రాజెక్ట్‌ల అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 02:57 PM

సౌత్ ఇండియా టాప్ హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కరు.లాస్ట్ ఇయర్ లో రిలీజ్ అయినా "పుష్ప ది రైజ్ " మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో.ఈ సినిమా లో కన్నడ బ్యూటీ రష్మిక అల్లు అర్జున్ సరసన నటించింది.ప్రస్తుతం అల్లు అర్జున్ ఆరు ప్రాజెక్ట్స్ కి సైన్ చేసాడు  అని సమాచారం.


పుష్ప: ది రూల్:-సుకుమార్ డైరెక్ట్ చేసిన "పుష్ప ది రైజ్ " పార్ట్ 2 "పుష్ప: ది రూల్" ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ మూవీని  డిసెంబర్ 2022 లో రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం .


వేణు శ్రీరామ్‌తో సినిమా:-కొన్ని సంవత్సరాల క్రితం, అల్లు అర్జున్ ఈ సినిమా గురించి అనౌన్స్ చేసారు. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు.


మురుగదాస్‌తో సినిమా:-లేటెస్ట్ అప్డేట్  ప్రకారం ,మురగదాస్ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో అని సమాచారం ఈ సినిమాని కలైపులి స్ తాను నిర్మించనున్నారు  .


కొరటాల శివతో   సినిమా:- ఈ కాంబినేషన్ లో వచ్చే మూవీలో గౌరవ్ పరీక్, మోనోజిత్ షిల్,అమన్ శర్మ సహాయక పాత్రలు పోషించనున్నారు. GA2 పిక్చర్స్ క్రింద సుధాకర్ మిక్కిలినేని ,శాండీ స్వాతి నట్టి దీనిని బ్యాంక్రోల్ చేస్తారు అని సమాచారం .


బోయపాటి శ్రీనుతో  సినిమా:-  ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమాని  గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందని ఫిలిం ఇండస్ట్రీ లో లేటెస్ట్ టాక్.


ప్రశాంత్ నీల్‌తో సినిమా:- ప్రశాంత్ నీల్‌ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చేయనున్నాడు అని వార్తలు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa