బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ "రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్" వెబ్ సిరీస్‌తో OTT ప్లాట్‌ఫారమ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.బ్రిటిష్ టీవీ షో లూథర్ ఆధారంగా "రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్" తీస్తున్నారు.రాజేష్ మపుస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ అన్ని ఎపిసోడ్‌లు మార్చి 4 నుండి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వస్తాయి అని మేకర్స్ అనౌన్స్ చేసారు. సైకలాజికల్ క్రైమ్ డ్రామా లో వస్తున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను హాట్‌స్టార్ విడుదల చేసింది.రుద్ర వీర్ సింగ్ అనే పోలీసు పాత్రలో అజయ్ దేవగన్ నటించాడు. ఈ సిరీస్ లో రాశి ఖన్నా నెగటివ్ రోల్ లో కనిపించనుంది .అజయ్ దేవగన్ భార్యగా ఈషా డియోల్ నటించింది.ట్రెయిలర్ హై టెన్షన్ మూమెంట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆడియన్స్ అండ్ మూవీ లవర్స్ ని అట్ట్రాక్ట్ చేస్తుంది .ఈ ట్రైలర్ ఈ సిరీస్ పై భారీ అంచనాలను పెంచుతుంది అని అందరూ భావిస్తున్నారు.అతుల్ కులకర్ణి, అశ్విని కల్సేకర్, ,ఆశిష్ విద్యార్థి ఈ సిరీస్‌లో ముఖ్య పాత్రలు పోషించారు.BBC స్టూడియోస్ ఇండియా ,అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa