ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజనీకాంత్ కుమార్తె కీలక ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 04:31 PM

కోవిడ్ బారిన పడిన సినీ నిర్మాత ఐశ్వర్య రజనీకాంత్ మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు. ఆమె తన భర్త ధనుష్‌తో విడిపోతున్నట్లు గత నెలలో ప్రకటించారు. దీంతో వారిద్దరూ విడిపోతున్నారనే వార్తలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. కానీ వారు తమ మాట విని కలుసుకుంటారని ధనుష్ తండ్రి మీడియాకు గతంలో చెప్పారు. తాజాగా దీనిపై ఐశ్వర్య స్పందించారు. తనతో పాటు ప్రేమ ఆలోచన కూడా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రేమకు రెండో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాను తమ తల్లీతండ్రి అంటే చాలా ఇష్టమని, తన పిల్లలను కూడా ప్రేమిస్తున్నానని చెప్పారు. అయితే విడాకల విషయం వెనక్కు తీసుకుంటున్నట్లు మాత్రం స్పష్టంగా చెప్పలేదు. అంతకుముందు జనవరిలో ఐశ్వర్య, ధనుష్ విడిపోతున్నట్లు ప్రకటిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పద్దెనిమిదేళ్లపాటు స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా కలిసిమెలిసి ఉన్నామన్నారు. ధనుష్ 2004లో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. వారికి యాత్ర రాజా, లింగ రాజా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa