యంగ్ అండ్ టాలెంటెడ్ మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ ఫేమస్ కొరియోగ్రాఫర్ బృందా దర్శకత్వంలో "హే సినామిక" అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిన సంగతే.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , అదితి రావు హైదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా CBFC నుండి క్లీన్ U సర్టిఫికేట్ పొందింది.ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. ట్రైలర్‌ను ఏ సెలబ్రిటీ రిలీజ్ చేస్తున్నారు అనేది ఇంకా ప్రకటించలేదు.జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ ,వయాకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది.మార్చి 3, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది అని మేకర్స్ ప్రకటించారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa