ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఆడవాళ్ళు మీకు జోహార్లు" సినిమా పై నేషనల్ క్రష్ వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 16, 2022, 12:20 PM

కిషోర్ తిరుమల దర్శకత్వంలో  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా  పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. హైదరాబాద్‌లో మేకర్స్ ఒక  ప్రెస్ మీట్ ను నిర్వహించగా ,నేషనల్ క్రష్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ,డైరెక్టర్ నాకు ఈ స్టోరీ చెప్తున్నప్పుడు, షూటింగ్ అండ్ డబ్బింగ్‌ సెషన్‌లోనూ నవ్వుతూనే ఉన్నాను.ఆడియన్స్ కి కూడా ఈ మూవీ చాల బాగా నచ్చుతుంది  అని చెప్పారు.అంతే కాకుండా ఈ మూవీ తనకు నచ్చిన సినిమాలలో ఒకటిగా ఉంటుందని తెలిపారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa