కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రంలో చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రం ఏప్రిల్ 1న విడుదల తేదీని ఖరారు చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ పై మళ్లీ క్రేజీ టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ రెండు భాషల్లో మాత్రమే ఉండే అవకాశం ఉందని వినికిడి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa