"టైగర్" అండ్ "టైగర్ జిందా హై" సల్మాన్ ఖాన్ కెరీర్లో ఈ రెండు సినిమా లు బిగ్గెస్ట్ హిట్స్ అని చెప్పొచ్చు.యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూలు చేశాయి.ప్రస్తుతం ,టైగర్ 3 షూటింగ్ లో సల్మాన్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మనీష్ శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి "హిందుస్థాన్ కా టైగర్" అనే టైటిల్ను లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ప్రస్తుతం ఢిల్లీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.ఇమ్రాన్ హష్మీ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.ఈ సినిమా కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa