ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి నటులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటుంటారు. ఇక ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వచ్చిందంటే చాలు ఆ నటుల ఆనందానికి హద్దులు ఉండవు.అంతేకాదు.. వారికి సినిమాల్లో తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినప్పటికీ ఆయన కోసం నటించిన వారు కూడా ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఓ నటుడికి బ్లాంక్ చెక్ ఇచ్చినా ఆయన ఆ సినిమాలో నటించలేదంట. ఆ నటుడు ఎవరో ఒక్కసారి చూద్దామా.ఇండస్ట్రీలో పబ్లిక్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్.నారాయణమూర్తి. ఆయన ఎప్పుడు కూడా కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సమాజంలో జరిగే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నైతిక విలువలకు అనుగుణంగా తన చిత్రాలను తీస్తూ ఉంటారు. అంతేకాక.. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
అయితే తెలుగు ప్రముఖ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం టెంపర్. ఈ సినిమాలో ఆర్.నారాయణమూర్తికి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అంతేకాక.. దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా టెంపర్ చిత్రంలో నటించడానికి ఆర్.నారాయణ మూర్తికి బ్లాంక్ చెక్ ఇచ్చి తనకు ఇష్టం వచ్చినంత పారితోషికం రాసుకొమ్మని అన్నారంట. కాగా.. ఈ చిత్రం కమర్షియల్ పరంగా ఉండటంతో నటుడు ఆర్.నారాయణ మూర్తి ఈ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలుపలేదంట.దీంతో ఆయన పాత్రలో పోసానిని తీసుకున్నారు. ఇక ఆర్.నారాయణ మూర్తి సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో పెళ్లి కూడా చేసుకోకుండా తన ఆస్తిని సైతం పేదలకు పంచి పెట్టిన గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన ఇప్పటికే ఎంతో మంది ప్రజలకు సహాయం అందిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు ఆయనకు సొంత ఇల్లు కూడా లేకపోవడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa