హిందీ చిత్రాలు కొన్ని మాత్రమే చేసినా చిరంజీవికి అక్కడ కూడా చెపుకోదగ్గ అభిమానులు ఉన్నారు. ఇదిలావుంటే చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన 'ఆచార్య' విడుదలకి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ముందుగా ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు హిందీ వెర్షన్ లోను భారీస్థాయిలో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్లో భారీస్థాయిలో ఈ సినిమాను వదలాలనే దిశగానే సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అవినీతి పరులైన భూస్వాముల పెత్తందారీతననానికి వ్యతిరేకంగా పోరాడే నక్సలైట్ల పాత్రల్లో చిరంజీవి - చరణ్ కనిపించనున్నారు. చిరూ సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఆయన నుంచి వదిలిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోనూ సూద్ .. సంగీత .. పోసాని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రెజీనా ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa