బాబాయ్ అబ్బాయ్ ల మధ్య పోటీ వచ్చిపడింది. పవన్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన 'భీమ్లా నాయక్'పై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 25వ తేదీన భారీస్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందని ఒక మాట చెప్పారు. దాంతో ఈ సినిమా ఏప్రిల్లోనే థియేటర్లకు వస్తుందనుకుని 'ఆడవాళ్లు మీకు జోహార్లు' .. 'గని' .. 'సెబాస్టియన్' వంటి చిన్న సినిమాలు ఈ నెల 25వ తేదీని ఖాయం చేసుకుని రంగంలోకి దిగాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా మారడంతో, 'భీమ్లా నాయక్' ఈ నెల 25వ తేదీనే రావడానికి రెడీ అయ్యాడు. మారిన డేట్ల కారణంగా బాబాయ్ .. అబ్బాయ్ ల మధ్య పోటీవచ్చి పడింది. పవన్ కి గల క్రేజ్ .. సితార బ్యానర్ కి గల ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అత్యధిక థియేటర్స్ ను ఆక్రమిస్తుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనికూడా లేదు. అందువలన ఈ రెండు సినిమాల మేకర్స్ మధ్య చర్చలు నడుస్తున్నాయట. ఆఖరికి ఏం తేలుస్తారనేది చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa