తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పిట్స్ పై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్రోలింగ్, మీమ్స్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. అలాంటి వాటిని పట్టించుకోనవసరం లేకపోయినా, కొన్ని విషయాల్లో బాధపడక తప్పదు అని తెలిపారు.మామూలుగా వాళ్లను చూడనని, ఎవరైనా పంపిస్తే చూస్తానని తెలిపారు.ఈ సందర్భంగా మోహన్ బాబు ఇద్దరు హీరోలపై ఆరోపణలు చేశారు. ఇద్దరు హీరోల పేర్లు చెప్పలేదు. ఇద్దరు హీరోలు 50-100 మందిని పెట్టుకుని అందరినీ ట్రోల్ చేయిస్తున్నారు అని తెలిపారు. ఆ హీరోలు ఎవరో తనకు తెలుసు అని అయన తెలిపారు.ఏదో ఒక రోజు వాళికి శిక్ష తప్పదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa