ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవును డేటింగ్ లో ఉన్నా : శృతి హాసన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 09:15 AM

కొంటే ప్రశ్నలు వేస్తారని తెలుసు. బాగా ఇబ్బంది పెడతారని కూడా తెలుసు. అయినా.. సమయం దొరి కినప్పుడల్లా అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది శృతి హాసన్. వాళ్లు అడిగిన ప్రశ్నలకు బోల్డ్ గా సమాధానం ఇస్తుంటుంది. తాజాగా చిట్ చాట్ లోనూ ముదుగుమ్మ మరింత ఓపెన్ అయింది. ఫోన్ నెంబర్ చెప్పమని అడిగితే.. ఇది వరకు చెప్పిన నెంబరే.. 'డయల్ 100' అంటూ సమాధానం ఇచ్చింది. డేటింగ్ లో ఉన్నారా ? అని అడిగితే.. కొద్దిసేపు ఊరించిన శృతి.. అవును శాంతను హజారిక ప్రేమలో ఉన్నట్లు ఒప్పేసుకుంది. 'నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది?' అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు... దాన్ని కనుకొనే పనిలో ఉన్నాను. కానీ, దాన్ని ఇంకా పెంచుకోవాలనుకుం టున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి 'సలార్', బాలయ్య 107 సినిమాల్లో నటి స్తున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa