విడుదలకు మరో వారం సమయం ఉందనగా భీమ్లా నాయక్ చిత్రం షూటింగ్ ముగిసింది. చివరి షెడ్యూల్ లో మిగిలి ఉన్న సన్నివేశాలను గత కొన్నిరోజులుగా హైదరాబాదు రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నారు. హీరో పవన్ కల్యాణ్ కూడా ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, షూటింగ్ పూర్తయిందని భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్ర సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లోనూ భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. యూఎస్‌లోనే 400కి పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ధృవీకరించారు. మొత్తానికి భీమ్లా నాయక్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa