సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో “భీమ్లా నాయక్”.థమన్ సంగీతం సమకూరుస్తుండగా నిత్య మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది. ఈ చిన్న గ్యాప్‌లో అభిమానులు భారీ ఉత్సాహాన్ని అనుభవిస్తున్నందున ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రం నుండి మోస్ట్ ఎవైటెడ్ ట్రైలర్‌ను సిద్ధం చేస్తున్నట్లు బజ్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి టీజర్ ఉండదని, డైరెక్ట్ ట్రైలర్ ఉంటుందని నిర్మాత నాగవంశీ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు ఆ తేదీ వినబడుతుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం, రేపు అంటే ఫిబ్రవరి 19న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa