ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అద్భుతమైన డాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన సమంత

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 12:12 PM

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని మొదటి పాట హలమత్తి అబిబూ ను ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పాట అరబిక్ భాషలో ఉండి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.భాషతో సంబంధం లేకుండా అలరిస్తోంది. ఆ పాట ప్రస్తుతం తమిళం తెలుగు లో మాత్రమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా కూడా సందడి చేస్తోంది. అప్పటి కొలవెరిడి సాంగ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఈ పాట ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున సక్సెస్‌ అయిన ఈ పాట నుండి ఒక బిట్‌ ను తీసుకుని హీరోయిన్ పూజా హెగ్డే డాన్స్ ఛాలెంజ్ మొదలు పెట్టింది. చాలెంజ్ లో ఇప్పటికే పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు పాల్గొన్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా డాన్స్ వేసి తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో పాటు బీస్ట్ సినిమాను తన వంతు గా ప్రమోషన్ చేసింది.


సినిమాలో పూజా హెగ్డే అద్భుతమైన డాన్స్ స్టెప్పులతో అదర గొట్టేసింది. అంతకు మించి స్టెప్పులను సమంతకు చేసిందంటూ ఈ వీడియోకు నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. కచ్చితంగా సమంత మంచి స్టెప్పులతో ఆకట్టుకుంది. పూజా హెగ్డే స్థాయిలోనే నడుము తిప్పుతూ డాన్స్ వేసి అందరినీ మెప్పించింది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరోవైపు యశోద అనే ఒక భారీ ఇండియా మూవీ సమంత చేస్తుంది అవి కాకుండా రెండు వెబ్ సిరీస్ లో ఒక హిందీ సినిమాల్లో కూడా ఆమె చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సమంత ఒక భారీ హిందీ సినిమాను కూడా కమిట్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. అన్నిటికీ మించి సమంత వెబ్ సిరీస్ లో మరింత బోల్డ్ గా నటించబోతోంది. ఇక ఇటీవల పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అబ్బురపరిచింది. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత సినిమాలతో ఫుల్ బిజీ అయింది.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa