సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో కోలీవుడ్ స్టార్ హీరో నటించిన "వాలిమై" సినిమా ఒకటి అని చెప్పొచ్చు . హెచ్.వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న థియేటర్లలోకి రానుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు . యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో అజిత్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు అని మేకర్స్ వెల్లడించారు .హ్యూమా ఖురేషి అజిత్ సరసన జంటగా నటిస్తుండగా ,టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందింది. 2 గంటల 56 నిమిషాలు రన్‌టైమ్ ని కలిగి ఉంది అని సమాచారం.బోనీకపూర్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హ్యూమా ఖురేషి, యామీ గౌతమ్, బాణి, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa