ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ హీరోయిన్ సంచలన నిర్ణయం...!

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 19, 2022, 12:10 PM

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తాప్సీ. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోల పక్కన నటించి మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌లో స్థిరపడింది. 'ముల్క్, బద్లా, తప్పడ్' వంటి సినిమాలతో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ విషయంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తాప్సీ గ్లామర్ పాత్రల్లో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ బ్యూటీకి స్కిన్ షో కలిసి రాలేదని తెలిసినా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుందని అంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఏడు సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అనురాగ్ కశ్యప్ 'దొబారా', క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్ శభాష్ మెహతో, బ్లర్, ఓ లడఖీ హై కహా చిత్రాల్లో నటించారు.అంతేకాకుండా తమిళంలో రెండు చిత్రాలు, తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ సినిమా చేస్తోంది. ఆయా సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించాల్సిన అవసరం లేదని, కథా బలమున్న చిత్రాలేని పేర్కొంటోంది. ఫలితంగా బికినీలో కనిపించేది లేదని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa