ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కావ్యా థాపర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 19, 2022, 12:11 PM

ఏక్ మినీ కథ సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది కావ్యా థాపర్. ఈ ఉత్తరాది భామ అందచందాలు నటనకు యూత్ టెంప్ట్ అయ్యింది. కానీ ఆ తర్వాత కావ్య నుంచి వరుస ప్రకటనలు వస్తాయనుకుంటే అలాంటిదేమీ లేదు. ఇక ఈ చిత్రంలో దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క మూవీ తో హిట్టందుకుని అతడు అరడజను సినిమాలకు సంతకాలు చేశాడు.ఇకపోతే వర్తమానంలో ఏక్ మినీ కథ హీరోయిన్ అరెస్టయ్యింది. అది కూడా తాగి వాహనం నడిపి ఒకరిని గుద్ది పోలీసులతో ఘర్షణ పడి చివరికి అరెస్టు వరకూ వెళ్లింది సీన్. వివరాల్లోకి వెళితే... కావ్య చేసిన ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 17 గురువారం ఉదయం జరిగింది. ప్రమాద సమయంలో కావ్య మద్యం సేవించినట్లు సమాచారం.


 


పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపారు. కావ్యపై డ్రంకెన్ డ్రైవ్ కేసు కింద కేసు నమోదైంది. దీంతో పాటు ఆమె పోలీసులతో గొడవ పడినందుకు వారిని దుర్భాషలాడినందుకు `ఘర్షణ కేసు` కూడా బుక్ చేసారు. జుహూ పోలీసుల వివరాల ప్రకారం..నిన్న ఉదయం మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి ఒక వ్యక్తిని గాయపరిచిన తర్వాత ఘటనా స్థలంలో పోలీసులతో గొడవకు దిగి దుర్భాషలాడటంతో నటి కావ్యా థాపర్ ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపామని వెల్లడించారు.అయితే దీనికి సంబంధించి కావ్య ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతం విచారణ సాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏక్ మినీ కథ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం నేరుగా OTTలో విడుదలైంది. సంతోష్ కి కావ్యకి చక్కని పేరు తెచ్చింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa