ప్రముఖ కన్నడ నటుడు, కన్నడ కళాతపస్విగా పేరు పొందిన రాజేష్ కన్నుమూశారు. ఆయనకు 89 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. రాజేశ్ 1932 ఏప్రిల్ 15న బెంగళూరులో జన్మించారు. ఆయన అసలు పేరు ముని చౌడప్ప. అయితే తన చిన్ననాటి నుంచే నటిస్తున్న ఆయన విద్యాసాగర్‌గా గుర్తింపుపొందారు. 1960లో కన్నడ సినీరంగంలోకి ప్రవేశించిన ఆయన తన పేరును రాజేశ్‌గా మార్చుకున్నారు. వందలాది సినిమాల్లో నటించిన ఆయన కళాతపస్విగా పేరొందారు. ఆయనకు కుమార్తె ఆశా రాణి ఉన్నారు. ఆమె ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తున్నారు. యాక్షన్ కింగ్, హీరో అర్జున్ కు రాజేష్ మామ. రాజేష్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa