పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం “ఈటి”. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్‌ని నిన్న మొన్న తమిళ్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ టీజర్‌ను తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సమయం ఫిక్స్ చేసారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. తమిళంలో తెరకెక్కిన ఈ టీజర్ తెలుగులో ఎలా ఉండబోతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa