ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 19, 2022, 01:40 PM

కన్నడ చిత్ర పరిశ్రమలో పునీత్ రాజ్ కుమార్ మరణం మర్చిపోక ముందే అలాంటి  విషాదం మరొకటి  చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు ‘కళాతపస్వి’ రాజేష్ శనివారం బెంగళూరులో కన్నుమూశారు.ఇటీవల అనారోగ్య కారణాలతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రాజేష్ శనివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారం రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు. నాలుగు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో రాజేష్ 150కి పైగా సినిమాల్లో నటించారు. 2014లో వచ్చిన ఆయన ఆత్మకథ ‘కళా తపస్వి రాజేష్ ఆత్మకథ’ కన్నడ చిత్రరంగంలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈయన వయస్సు 89 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు.  ఆయన కుమార్తె ఆశా రాణి , బహుభాషా సౌత్ నటుడు అర్జున్ సర్జాను వివాహమాడారు. రాజేష్ మృతి పట్ల పలువురు కన్నడ సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa