తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది కీర్తి సురేష్. తెలుగులో మహేష్ జంటగా 'సర్కారువారి పాట' .. తమిళంలో కథానాయిక 'సానికాయిధం' విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళంలో కూడా ఓ సినిమా పూర్తి చేసిన ఆమె.. ఆ సినిమా పేరు ‘వాషి’. ఈ చిత్రంలో టోవినో థామస్ - కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్టులుక్ సినిమా నుంచి వదిలారు. ఈ పోస్టర్‌లో ఇద్దరూ లాయర్లుగా కనిపిస్తున్నారు. రేవతి కళామందిర్ బ్యానర్‌పై సురేష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు జి రాఘవ్ దర్శకత్వం వహించారు. కైలాష్ మీనన్ సంగీతం అందించిన ఈ సినిమా విభిన్నమైన కథాంశాలు, ఆసక్తికరమైన మలుపులతో సాగుతుందని తెలుస్తోంది. 'మరక్కర్' తర్వాత కీర్తి సురేష్ చేస్తున్న మలయాళ సినిమా ఇది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa