డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే "లైగర్" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు . అంతేకాకుండా, పూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ "జన గణ మన " గురించి కూడా ప్రకటించాడు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన "జన గణ మన" షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నాడు అని సమాచారం . ఛార్మీ కౌర్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నాడు అని ఫిలిం ఇండస్ట్రీ లో లేటెస్ట్ టాక్.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa