ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని 'అంటే సుందరానికీ' మూవీ న్యూ అప్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 07:30 PM

నాని హీరోగా కథానాయికగా నజ్రియా నజీమ్ తో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. 'బ్రోచేవారెవరురా' సినిమాతో వివేక్ ఆత్రేయ తన సత్తా చాటుకున్నాడు.ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన ఈ సినిమాను చేస్తున్నాడు.వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నదియా .. సుహాస్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అయితే  ఈ నెల 24వ తేదీన నాని పుట్టినరోజు .. ఈ సందర్భంగా ముందురోజున సాయంత్రం 4:05 నిమిషాలకు ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను వదలనున్నారు. ఆ సమయంలో యువ సుందరుడి బర్త్ డే హోమం జరుగుతుందంటూ ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.మరి ఆ సమయంలో మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ను వదులుతారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa