'చిత్రం', 'జయం', 'నేనే రాజు నేనే మంత్రి' వంటి సూపర్ హిట్ సినిమాలుకు తీసిన డైరెక్టర్ తేజ. తాజాగా దగ్గుబాటి అభిరామ్ హీరోగా 'అహింస' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆ సినిమా తరువాత నల్లమలుపు బుజ్జి నిర్మాతగా తేజ 'విక్రమాదిత్య' అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించబోతున్నాడు. తేజ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa