సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి నటిస్తున "భీమ్లా నాయక్" విడుదల చెయ్యటానికి మూవీ మేకర్స్ సిద్దంగా ఉన్నారు.ఈ చిత్రంలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు.ఫిబ్రవరి 25, 2022న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.తాజాగా , మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసారు .పవన్ ఫాన్స్ అండ్ సినిమా లవర్స్ కి థియేటర్లలో ఫుల్ జోష్ ఉంటుంది అని లేటెస్ట్ టాక్ .యూట్యూబ్‌లో ఈ సినిమా ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది.ఈ ట్రైలర్ సినిమాపై ఫుల్ హైప్‌ని పెంచింది.ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా టిక్కెట్ల బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమా టిక్కెట్లు హై రేంజ్ లో అమ్ముడయ్యాయి . "భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా మరియు థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa