"శ్యామ్ సింగరాయ్" మూవీ తో సాలిడ్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం "అంటే సుందరానికి" అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే . ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్, ఈ రొమాంటిక్ కామెడీ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఫిబ్రవరి 24న హీరో నాని పుట్టినరోజు సందర్భంగా అతని ఫాన్స్ కి మూవీ మేకర్స్ మంచి ట్రీట్ ని రెడీ చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి . ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు 'సుందర్ బర్త్‌డే బ్లాస్ట్' అనౌన్స్ చేస్తాము అని మేకర్స్ ఫన్నీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు .ఈ రోమ్-కామ్ సినిమాని మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది మూవీ మేకర్స్ వెల్లడించారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa