యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కార్తీక్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈరోజు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. "మీకు శుభాకాంక్షలు" అనే టైటిల్‌తో మేకర్స్ ఈ చిత్రాన్ని లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ హీరో ఫుల్ మాస్ గా కనిపిస్తున్నాడు. కన్నడ బ్యూటీ సంజనా ఆనంద్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎస్వీ కృష్ణా రెడ్డి, సంగీత, సమీర్, సిద్దార్థ మీనన్, బాబా భాస్కర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ, మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa