దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. బోయపాటి ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాలో రామ్ సరసన నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను మేకర్స్ సంప్రదించినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ గ్లామరస్ బ్యూటీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రామ్, పరిణీతి చోప్రా కాంబినేషన్ డెడ్ గా ఉంటుందని భావిస్తున్నారు. రామ్ ప్రస్తుతం ‘ది వారియర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa