ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటున్న సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 12:42 PM

మాధవన్ అండ్ విజయ్ సేతుపతి నటించిన తమిళ సినిమా  "విక్రమ్ వేద" సినిమాని  హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కి పుష్కర్ అండ్  గాయత్రి  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిందీ వెర్షన్ రీమేక్ లో హృతిక్ రోషన్ అండ్  సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.సైఫ్ అలీ ఖాన్  విక్రమ్ రోల్ లో కనిపించనుండగా,హృతిక్ రోషన్  వేద రోల్ పోషిస్తున్నాడు. విక్రమ్‌గా నటిస్తున్న  సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజు  మేకర్స్ రిలీజ్ చేసారు.సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. వైట్  టీ షర్ట్ అండ్  బ్లూ జీన్స్ లో  సైఫ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు .ఈ నియో-నోయర్ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాలో  రాధికా ఆప్టే కీలక పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 30, 2022న ఈ సినిమాని రిలీజ్  చేసేందుకు మేకర్స్  ప్లాన్ చేస్తున్నారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్  ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa